పవన్ తో సినిమాపై ఆసక్తి రేపిన క్రిష్.!

మన టాలీవుడ్ లో ఉన్న అందరి దర్శకులలో ఒక్కొక్కరికీ ఒక్క ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. అలా మన టాలీవుడ్ లో క్రిష్ జాగర్లమూడి తెరకెక్కించే చిత్రాలు అంటే ప్రతీ ఒక్కరికీ సంథింగ్ స్పెషల్ గాను మరియు చాలా యూనిక్ గా ఉంటాయి. అలంటి దర్శకుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో అందులోను ఒక పీరియాడిక్ డ్రామా తీస్తుండడంతో మంచి అంచనాలు నెలకొన్నాయి.

ఇదిలా ఉండగా ఈరోజు పవన్ పుట్టినరోజు కావడంతో ఈ చిత్రానికి సంబంధించి కూడా అధికారిక అప్డేట్ ను వారు చెప్పినట్టుగానే అందించారు. ప్రీ లుక్ పోస్టర్ తో క్రిష్ పెట్టిన ట్వీట్ కూడా మంచి ఆసక్తికరంగా అనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ గారు, పదిహేన్రోజుల షూటింగ్ ప్రతిక్షణం టీం అందరికీ గొప్ప జ్ఞాపకంలా కదులుతుంది..చిరస్థాయిగా నిలిచే విజయం కంటికి కనిపిస్తుంది..ఇందుకు కారణం మీరు, మీ ప్రోత్సాహం, మీ సహృదయం..ఎప్పటికీ ఇలాగే కోట్లాది జనం శుభాకాంక్షలు అందుకుంటుండాలని ఆశిస్తూ” పవన్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

Exit mobile version