సుశాంత్ సింగ్ కేసు మరో ఊహించని ట్విస్ట్.!

గత జూన్ నెల 14 వ తారీఖున బాలీవుడ్ టాలెంటెడ్ అండ్ యుంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మ హత్యా ఘటన ఎంతటి కలకలాన్ని రేపిందో అందరికీ తెలిసిందే. దీనితో సుశాంత్ మరణం చుట్టూతా ఇప్పటి వరకు ఎన్నో రకాల కథనాలు కోణాలు తెర మీదకు వచ్చాయి. అయితే ఈ కేసు సిబిఐ వరకు వెళ్లే వరకు సుశాంత్ అభిమానులు మరియు అతని సానుభూతిపరులు ఊరుకోలేదు.

ఇక ఎట్టకేలకు సిబిఐ కు వెళ్లడంతో అసలు నిజానిజాలు తెలుస్తాయని సుశాంత్ అభిమానులు ఎదురు చూస్తున్నారు. అయితే మొదటి నుంచి సుశాంత్ ను ఆత్మహత్య అనే కంటే కూడా హత్యే అన్నది గట్టిగా వినిపించింది. కానీ ఇపుడు ఊహించని విధంగా సిబిఐ వారు ఆసక్తికర అంశాన్ని వెల్లడించారు.

ఇప్పటి వరకు తాము చేసిన ఇన్వెస్టిగేషన్ లో సుశాంత్ ది హత్య అని చెప్పడానికి ఎలాంటి లింక్ దొరకలేదని తెలిపారు. అతని పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా ఆత్మహత్య గానే వచ్చిందని అలాగే రెండు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నప్పటికీ ఇంకా ఇది హత్యే అనేందుకు సరైన ఆధారాలు ఇంకా దొరకలేదని సిబిఐ వారు తెలిపారు. దీనితో మరోసారి సుశాంత్ కేసులో ఇది ఊహించని మలుపుగా మారింది.

Exit mobile version