జపాన్ లో రచ్చ లేపుతున్న ప్రభాస్ సినిమా.!

బాహుబలి తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన భారీ యాక్షన్ చిత్రం “సాహో”. యువ దర్శకుడు సుజీత్ తో తెరకెక్కించిన ఈ చిత్రం ఇపుడు ఏడాది పూర్తి చేసుకుంది అయితే ఈ చిత్రం మన దగ్గర ఊహించిన స్థాయి విజయాన్ని అందుకోకపోయినప్పటికీ వసూళ్ల పరంగా దుమ్ము రేపింది.

అలాగే ఇపుడు మరోపక్క ఈ చిత్రం ఇంకా సిల్వర్ స్క్రీన్ పై రచ్చ లేపుతుందట. అక్కడ ఈ చిత్రం విడుదలకు ముందే మంచి హైప్ ను తెచ్చుకున్న ఈ చిత్రం విడుదలయ్యాక అక్కడ భారీ విజయాన్ని అందుకుంది. ఆ విజయం కాస్తా అంత తొందరగా ఏమీ ఆగలేదట.

తాజాగా 150 రోజులు పూర్తి చేసుకొని ఇంకా అక్కడ విజయవంతంగా కొనసాగుతుందట. ఇప్పటికే ప్రభాస్ క్రేజ్ జపాన్ లో మాములుగా లేదు. దీనితో అది కాస్త ఈ చిత్రం సాలిడ్ విజయంతో మరింత స్థాయికి వెళ్ళింది అని చెప్పాలి. భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించిన ఈ చిత్రంలో ప్రభాస్ సరసన శ్రద్దా కపూర్ హీరోయిన్ గా నటించింది.

Exit mobile version