ప్లాస్మా డొనేషన్ లో కీరవాణి, తనయుడు భైరవ!

ఇపుడు ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా ధాటి మన టాలీవుడ్ అగ్రులు వరకు వచ్చేసింది. గత కొన్ని రోజుల కితమే దర్శక ధీరుడు రాజమౌళి మరియు సంగీత దర్శకుడు ఎం ఎం కీరవాణిలు కరోనా బారిన పడి దానిని జయించారు. అయితే ఆ తర్వాత ఈ ఇరువురు ప్లాస్మా దానం చేసి మేము కూడా రియల్ హీరోలు అనిపించుకుంటామని తెలిపారు. ఇపుడు అలా అన్నట్టుగానే మొదట కీరవాణి ప్లాస్మా డొనేట్ చేసినట్టుగా తెలిపారు.

కిమ్స్ ఆసుపత్రిలో డొనేట్ చేశామని,ఇదంతా సాధారణ రక్త దానం లానే ఉంటుందని ఎవరు భయపడనక్కర్లేదు అని ధైర్యం చెప్పారు. అలాగే కీరవాణితో పాటుగా యువ సంగీత దర్శకుడు మరియు సింగర్ కీరవాణి తనయుడు కాల భైరవ కూడా ప్లాస్మా డొనేట్ చేసినట్టుగా తెలిపారు. అంతే కాకుండా కరోనా నుంచి ఎవరెవరు బయట పడ్డారో వారంతా ఖచ్చితంగా ముందుకొచ్చి ప్లాస్మా దానం చెయ్యాలని కోరుకుంటున్నట్టుగా కాల భైరవ తెలిపారు. ఎవరు ఎదురు చూడొద్దు ఇది ఎమర్జెన్సీ అని తాను కూడా ఫోటో పెట్టి సోషల్ మీడియా ద్వారా తెలిపారు.

Exit mobile version