అక్కడ ఓటిటిలో “అర్జున్ రెడ్డి” రెండో సినిమా?

మన తెలుగులో “అర్జున్ రెడ్డి” చిత్రం ఎంత పెద్ద సెన్సేషన్ ను క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ ఒక్క సినిమా దెబ్బకు విజయ్ దేవకొండ ఓవర్ నైట్ స్టార్ అయ్యిపోగా దర్శకుడు సందీప్ రెడ్డి వంగ అదే సినిమాను బాలీవుడ్ లో కూడా తీసి ఇపుడు పాన్ ఇండియన్ డైరెక్టర్ అయ్యిపోయాడు. అయితే ఈ చిత్రాన్ని ఒక్క హిందీలోనే కాకుండా తమిళ్ లో కూడా రీమేక్ చేసిన సంగతి తెలిసిందే.

కానీ ఆ ఒక్క ఇండస్ట్రీలో మాత్రమే ఈ చిత్రాన్ని రెండు సార్లు తీశారు. విలక్షణ నటుడు చియాన్ విక్రమ్ తనయుడు ధృవ్ హీరోగా పరిచయం చేస్తూ అక్కడి సంచలన చిత్రాల దర్శకుడు బాల “వర్మ” పేరిట ఈ చిత్రాన్ని తీశారు. కానీ ఈ చిత్రం పూర్తయ్యినప్పటికీ ఫైనల్ అవుట్ ఫుట్ ఎవరికీ రుచించకపోవడంతో మళ్ళీ వేరే దర్శకునితో “ఆదిత్య వర్మ” గా తీసి సాలిడ్ హిట్ కొట్టారు.

దీనితో ముందు తీసిన చిత్రం అలా హోల్డ్ లోనే ఉండిపోయింది. కానీ ఇపుడు ఈ చిత్రం మాత్రం డైరెక్ట్ స్ట్రీమింగ్ లో విడుదల కానున్నట్టుగా వినిపిస్తుంది. అమెజాన్ ప్రైమ్ వారు ఈ చిత్రం స్ట్రీమింగ్ హక్కులను కొనుగోలు చేసి నవంబర్ నెలలో విడుదల చేసే ప్లానింగ్ లో ఉన్నట్టు తెలుస్తుంది. మరి ఈ వెర్షన్ ఎలా ఉంటుందో చూడాలి.

Exit mobile version