ప్రభాస్ తరువాత ప్లేస్ ఆ హీరోదేనట !

బస్ డ్రైవర్ కొడుకుగా కెరీర్ స్టార్ట్ చేసి.. ఆ తరువాత సీరియల్ యాక్టర్ నుండి స్టార్ హీరో అయ్యాడు కన్నడ రాకింగ్ స్టార్ యశ్. అయితే యశ్ సినీ జర్నీ కేజీఎఫ్ తోనే మరో రేంజ్ కి వెళ్ళింది. షార్ప్ డైరెక్టర్ గా ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ `కేజీఎఫ్ చాప్టర్- 1` గొప్ప సంచలనాలనే సృష్టించింది. అన్ని బాషలలో బాక్సాఫీస్ వద్ద ఎంత వసూళ్లు చేసిందనేది పక్కన పెడితే.. యశ్ ను మాత్రం పాన్ ఇండియా స్టార్ ను చేసింది ఈ సినిమా.

ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ తో యశ్ రేంజ్ మరింత పెరగబోతుందట, ప్రభాస్ తరువాత సౌత్ ఇండస్ట్రీ నుండి పాన్ ఇండియా స్టార్స్ నేమ్స్ లో యశ్ పేరే ముందు ఉంటుందని బాలీవుడ్ మీడియాలో కథనాలను వస్తున్నాయంటే యశ్ రేంజ్ ను అర్ధం చేసుకోవచ్చు. `కేజీఎఫ్ సీక్వెల్ గురించి బాలీవుడ్ మీడియా బాగానే ప్రొజెట్ చేస్తోంది. పైగా ఈ సినిమాకి బాలీవుడ్ లో ఫుల్ క్రేజ్ ఉంది. అందుకు కారణం సినిమాలో విలన్ గా సంజయ్ దత్ నటిస్తుండటంతో ఈ సీక్వెల్ కి హిందీలో మంచి డిమాండ్ రావడానికి హెల్ప్ అయింది.

Exit mobile version