బాలయ్య బాబు బోయపాటి శ్రీను సినిమా నుండి జూన్ 10న బాలయ్య పుట్టినరోజు స్పెషల్ గా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేస్తారని బాలయ్య ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఫస్ట్ లుక్ తో పాటు నందమూరి ఫ్యాన్స్ కు బాలయ్య మరో కానుక కూడా ఇవ్వనున్నారు. తన పుట్టినరోజు సందర్భంగా బాలయ్య తన తరువాత సినిమాని కూడా ప్రకటించబోతునట్లు తెలుస్తోంది.
ఈ సినిమా టైటిల్ పై అనేక రూమర్స్ వచ్చినా, ఈ చిత్రానికి ‘మోనార్క్’ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారని టాక్. జూన్ 10న ఈ టైటిల్ ను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఇక ఈ సినిమాలో బాలయ్య సరసన కొత్త హీరోయిన్ నటిస్తోంది. మొత్తానికి బాలయ్య జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో ఫుల్ బిజీ అవుతున్నారు.
బాలయ్యకు ‘సింహ’ రూపంలో పెద్ద హిట్ ఇచ్చిన బోయపాటి ఆ తర్వాత దాన్ని మించి ‘లెజెండ్’ విజయాన్ని అందించారు. కాబట్టి ఈసారి ‘లెజెండ్’ను మించిన హిట్ పడాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ద్వారక క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు.