పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఇప్పుడు చేస్తున్న సినిమాల్లో పాన్ ఇండియా ప్రాజెక్ట్ లు హరిహర వీరమల్లు అలాగే ఓజి చిత్రాలు కంప్లీట్ చేసి రీజనల్ మాస్ ఎంటర్టైనర్ చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ లో రీసెంట్ గానే జాయిన్ అయ్యారు. ఇక ఈ సినిమా షూటింగ్ శరవేగంగా ప్రస్తుతం కొనసాగుతుండగా ఈ గ్యాప్ లోనే హీరోయిన్ శ్రీలీల బర్త్ డే కూడా వచ్చింది.
మరి తన పుట్టినరోజుని చిత్ర యూనిట్ సినిమా షూటింగ్ సెట్స్ లో చేయడం దాని తాలూకా పిక్ ఇపుడు బయటకి వచ్చి వైరల్ గా మారింది. మరి ఇందులో శ్రీలీల సింపుల్ లుక్స్ లో కనిపిస్తుండగా పవన్ కళ్యాణ్ మాత్రం పోలీస్ యూనిఫామ్ గెటప్ లో కనిపిస్తున్నారు. దీనితో ఈ స్పెషల్ మూమెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.