ఆ స్టోరీని ఎన్టీఆర్ తోనే చేస్తాడట

డైరెక్టర్ ప్రశాంత్ నీల్ చేసింది కేవలం రెండు చిత్రాలు. ఆయన మొదటి చిత్రం 2014లో వచ్చిన ఉగ్రం. ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఉగ్రం మూవీ విడుదలైన నాలుగేళ్లకు ప్రశాంత్ నీల్ యష్ హీరోగా కెజిఫ్ తెరకెక్కించారు. ఆ సినిమా ఎంతటి ప్రభంజనమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. విడుదలైన అన్ని భాషలో భారీ విజయం అందుకున్న ఆ చిత్రం హీరో యష్ ని మరియు దర్శకుడు ప్రశాంత్ నీల్ ని దేశవ్యాప్తంగా ఫేమస్ చేసింది.

మరి ఇలాంటి దర్శకుడు ఎన్టీఆర్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆయన దగ్గర ఎన్టీఆర్ కోసం ఓ మాస్ కమర్షియల్ స్టోరీ ఉందట. ఆ కథను ఎన్టీఆర్ తోనే చేయాలని దర్శకుడు ప్రశాంత్ నీల్ భావిస్తున్నాడట. కాగా ఎన్టీఆర్ సైతం ఈ ప్రాజెక్ట్ పట్ల ఆసక్తిగా ఉన్నారు. త్రివిక్రమ్ మూవీ అనంతరం వీరి కాంబినేషన్ లో మూవీ వచ్చే సూచనలు కలవు. ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ మరియు త్రివిక్రమ్ మూవీ నుండి బయటికి రావడానికి మరో ఏడాది సమయం పడుతుంది. ఏదిఏమైనా ఈ క్రేజీ కాంబినేషన్ సెట్ కావాలని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Exit mobile version