బాలయ్య అసిస్టెంట్ గా యంగ్ హీరో ?

బాలయ్య బాబు హీరోగా మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో రాబోతున్న సినిమా గురించి ఇప్పటికే అనేక రకాలుగా చాల రూమర్స్ సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉన్నాయి. అయితే తాజాగా ఈ సినిమా గురించి మరో ఇంట్రస్టింగ్ రూమర్ వినిపిస్తోంది. ఈ సినిమాలో ఓ యంగ్ హీరో కీలక పాత్రలో నటిస్తున్నాడట. ‘ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ’ సినిమాతో హీరోగానే హిట్ ఎంట్రీ ఇచ్చిన ‘నవీన్‌ పొలిశెట్టి’ బాలయ్య సినిమాలో కనిపించబోతున్నాడు. నవీన్ సినిమాలో బాలయ్యకు అసిస్టెంట్ గా కనిపిస్తాడట.

ఇక ఈ సినిమాతో ఓ కొత్త హీరోయిన్ ను పరిచయం చేయబోతున్నామని.. ఇప్పటికే ఇద్దరిని షార్ట్ లిస్ట్ చేసామని.. సరైన టైమ్ లో వాళ్లలో ఒకరిని హీరోయిన్ గా పరిచయం చేయబోతున్నామని బోయపాటి రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. అలాగే అక్టోబర్ కల్లా షూటింగ్ పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నామని కూడా బోయపాటి క్లారిటీ ఇచ్చారు. నందమూరి బాలకృష్ణ స్పీడ్ పెంచారు. జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో ఫుల్ బిజీ అవుతున్నారు.

ఈ చిత్రాన్ని మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించనుండగా తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. బాలయ్యకు ‘సింహ’ రూపంలో పెద్ద హిట్ ఇచ్చిన బోయపాటి ఆ తర్వాత దాన్ని మించి ‘లెజెండ్’ విజయాన్ని అందించారు. కాబట్టి ఈసారి ‘లెజెండ్’ను మించిన హిట్ పడాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

Exit mobile version