నాగ శౌర్య మరియు రీతూ వర్మ జంటగా నూతన లేడీ డైరెక్టర్ లక్ష్మీ సౌజన్య దర్శకురాలిగా పరిచయమవుతున్న కొత్త చిత్రం నేడు ప్రారంభమైంది. ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు ఈ రోజు ఉదయం పది గంటల ఎనిమిది నిమిషాలకు ఫిలిం నగర్ లోని సంస్థ కార్యాలయంలో రంభమయ్యాయి.ఈనెల 19 నుంచి చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుంది. చిత్రానికి సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక వర్గం వివరాలు మరికొద్దిరోజులలో ప్రకటిస్తామని తెలిపారు నిర్మాత సూర్య దేవర నాగవంశి.
ఇక నాగ శౌర్య ఇటీవల నటించిన యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ అశ్వథామ సూపర్ హిట్ గా నిలిచింది. ఆ విజయం ఇచ్చిన స్పూర్తితో హీరో నాగ శౌర్య వరుసగా సినిమాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: వంశి పచ్చి పులుసు, సంగీతం: విశాల్ చంద్రశేఖర్,ఎడిటర్: నవీన్ నూలి; ఆర్ట్: ఏ.ఎస్.ప్రకాష్, సమర్పణ: పి.డి.వి.ప్రసాద్.