భీష్మ ప్రమోషన్స్ మొదలెట్టాము అంటున్న నితిన్

హీరో నితిన్ నటించిన యూత్ ఫుల్ లవ్ ఎంటర్టైనర్ భీష్మ. ఈ చిత్రం ఈనెల 21న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది. కాగా భీష్మ ప్రొమోషన్స్ మొదలెట్టేశాం అంటూ హీరో నితిన్ హీరోయిన్ రష్మిక తో ఉన్న ఫోటో ట్విట్టర్ లో పంచుకున్నారు. భీష్మ చిత్ర టీజర్ ఇప్పటికే విడుదలై మంచి ఆదరణ దక్కించుకుంది. ఇక మహతి స్వర సాగర్ సంగీతం అందించగా విడుదలైన అన్ని సాంగ్స్ యూత్ ని బాగా ఆకట్టుకుంటున్నాయి.

సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దర్శకుడు వెంకీ కుడుముల తెరకెక్కిస్తున్నారు. ఇక నితిన్ చివరి మూవీ శ్రీనివాస కళ్యాణం విడుదలై ఏడాది దాటిపోయింది. దీనితో భీష్మ చిత్రం కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

Exit mobile version