నాని మొదటిసారి కంప్లీట్ గా ఓ డిఫరెంట్ రోల్ లో కనిపించనున్నాడు. వి మూవీలో ఆయన పాత్ర చాల భిన్నంగా ఆసక్తిగొలిపేలా ఉంటుందని ఇప్పటికే ప్రచారం జరుగుతుంది. వి చిత్రంలో నాని మెర్సీలెస్ సీరియస్ కిల్లర్ గా కనిపిస్తాడట. ఇక మరో హీరో సుధీర్ పాత్ర కూడా వి మూవీపై అంచనాలు పెరిగేలా చేస్తుంది. ఆయన కిల్లర్ నాని వెంటాడే అధికారి పాత్ర చేస్తున్నారని వినికిడి. నాని కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న వి మూవీ టీజర్ ఈనెల 17న విడుదల కానుంది. దీనితో టీజర్ లో నాని ఎలా ఉంటాడు, ఆయన పాత్ర తీరు ఎలా ఉంటుందనే ఆసక్తి విపరీతంగా పెరిగిపోయింది. దీనితో నాని అభిమానులు ఈ టీజర్ కోసం ఆసక్తిగా ఎదురుస్తున్నారు.
దర్శకుడు మోహన్ కృష్ణ ఇంద్రగంటి వి చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా దిల్ రాజు నిర్మిస్తున్నారు. నివేదా థామస్, అదితి రావ్ హైదరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం అమిత్ త్రివేది అందిస్తున్నారు. వచ్చే నెల 25న ఉగాది కానుకగా వి విడుదల కానుంది.