‘అ’ నిర్మాత ఏమయ్యాడు ప్రశాంత్ వర్మ..?

ట్విట్టర్ వేదికగా దర్శకుడు ప్రశాంత్ వర్మ తనకు ఓ నిర్మాత కావాలని తెలియజేశారు. ‘అ’ మూవీ సీక్వెల్ స్క్రిప్ట్ సిద్ధంగా ఉందని నిర్మాత వస్తే మొదలుపెట్టడమే తరువాయి అని చెప్పుకొచ్చారు. ‘అ’ మూవీ సీక్వెల్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు నా ధన్య వాదాలు అన్నారు. నేను ఏడాది క్రితమే ‘అ’ మూవీ స్క్రిప్ట్ పూర్తి చేశాను, ఐతే ఇలాంటి క్రేజీ స్క్రిప్ట్ ని అంతే క్రేజీగా భావించి నిర్మించే నిర్మాత దొరకడం లేదు.’అ’ సినిమా సీక్వెల్ మీ ముందుకు తేవాలని నా ప్రయత్నం నేను చేస్తున్నాను. నన్ను నమ్మండి అని ట్వీట్ చేశారు.

మరి ‘అ’ నిర్మాత నాని ఏమయ్యాడు అనే సందేహం అందరికీ కలుగుతుంది. నాని సొంత నిర్మాణ సంస్థ వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ లో తెరకెక్కిన మొదటి చిత్రం ‘అ’ కావడం విశేషం. ప్రశాంత్ వర్మ కు ప్రొడ్యూసర్ దొరకలేదని ఇబ్బంది పడుతున్న తరుణంలో మొదటి భాగం నిర్మించిన నాని ఏమయ్యారనే సందేహం కలుగుతుంది. ఇక నాని ఆ బ్యానర్ లో రెండవ చిత్రంగా ‘హిట్’ నిర్మిస్తున్నారు. హీరో విశ్వక్ సేన్ నటిస్తున్న ఈ చిత్రం క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కుతుంది.

Exit mobile version