శీనయ్య పాత్రకు దేవరకొండకు స్ఫూర్తి ఎవరంటే?

వరల్డ్ ఫేమస్ లవర్ మూవీలోమూడు విభిన్నమైన గెటప్స్ లో దేవరకొండ కనిపిస్తున్నాడు. వీటిలో శీనయ్య అనే ఓ పాత్ర ఉంది. బొగ్గుగనిలో కార్మికునిగా తెలంగాణా పల్లెటూరికి చెందిన వ్యక్తిగా విజయ్ కనిపించనున్నాడు. ఇక ఈ పాత్రకు భార్యగా స్వర్ణ పేరుతో ఐశ్వర్య రాజేష్ కనిపిస్తున్నారు. ఈ రోల్ నందు దేవరకొండ ఇల్లు, ఇల్లాలు, పిల్లలు మరియు ఆర్ధిక ఇబ్బందులు పడే, సాధారణ భర్త పాత్ర చేస్తున్నారు. కాగా ఇలాంటి జీవన విధానం తనకు అసలు అనుభవం లేదట. ఐతే చిన్నతంలో వాళ్ళ నాన్న లుంగీ ఎలా కట్టుకొనే వాడు, అన్నం పెట్టమని అమ్మని ఎలా పిల్చేవాడు, ఎలా పడుకునేవాడు వంటి విషయాలు గుర్తుకు తెచ్చుకొని విజయ్ ఆ పాత్ర చేశారట.

వరల్డ్ ఫేమస్ లవర్ మూవీలో శీనయ్య పాత్ర చేయడానికి తనకు స్ఫూర్తి వాళ్ళ నాన్నగారేనట. ఈ విషయాన్ని దేవరకొండ స్వయంగా చెప్పుకొచ్చారు. ఇక దర్శకుడు క్రాంతి మాధవ్ వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా, కె ఏ వల్లభ నిర్మిస్తున్నారు. రాశి ఖన్నా, క్యాథరిన్, ఐశ్వర్యరాజేష్, ఇసబెల్లా హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం గోపి సుందర్ అందిస్తున్నారు.

Exit mobile version