శాన్ ఫ్రాన్సిస్కో కి మారిన వై.వి.యస్ సినిమా


వై.వి.యస్ చౌదరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రేయ్’ చిత్రం ప్రస్తుతం యు.ఎస్ లో చిత్రీకరణ జరుపుకుంటోంది. మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు సాయి ధరం తేజ్ హీరోగా నటిస్తున్న ఈ మ్యూజికల్ లవ్ స్టోరీలో సైయామి ఖేర్ మరియు శ్రద్ద దాస్ కథానాయికలుగా నటిస్తున్నారు. గత కొన్ని నెలలుగా న్యూయార్క్ లో చిత్రీకరణ జరుపుకున్న ఈ చిత్రం ప్రస్తుతం శాన్ ఫ్రాన్సిస్కో లో చిత్రీకరణ జరుపుకుంటోంది. శాన్ ఫ్రాన్సిస్కో షెడ్యూల్ కోసం శ్రద్ద దాస్ ఇటీవలే యు.ఎస్ వెళ్లి ఈ చిత్ర బృందంతో కలిసారు. ప్రస్తుతం ఈ సిటీలో గడ్డకట్టే చలి ఉంటుంది, అలాంటి వాతావరణం ఉన్నా ఎంతో కష్టపడి అక్కడ ఉన్న కొన్ని అందమైన ప్రదేశాల్లో చిత్రీకరిస్తున్నారు. చక్రి సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని వై.వి.యస్ చౌదరి స్వయంగా నిర్మిస్తున్నారు.

Exit mobile version