వెంకీ మరియు మహేష్ ప్రేక్షకుల మనస్సు దోచుకుంటారు

విక్టరీ వెంకటేష్ మరియు సూపర్ స్టార్ మహేష్ బాబు అన్నదమ్ములుగా నటిస్తున్న మల్టీ స్టారర్ చిత్రం’ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’. చిత్ర వర్గాల నుండి ఈ చిత్రం గురించి అద్భుతమైన స్పందన వినిపిస్తోంది. ఈ చిత్రంతో విక్టరీ వెంకటేష్ మరియు సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యామిలీ ప్రేక్షకుల మదిని మరియు యూత్ మనస్సుని గెలుచుకుంటారని దిల్ రాజు ఎంతో ధీమాగా ఉన్నారు. ప్రస్తుతం మానవ సంభందాలు అనేటివి బాగా కృత్రిమమైపోయాయి. ఈ చిత్రంలో ఉమ్మడి కుటుంబంలో ఉండే సంబంధ బాందవ్యాల గురించి, అన్యోన్యతని గురించి మరియు ముఖ్యంగా అన్నదమ్ముల మధ్య ఉండే అద్భుతమైన సంబంధాన్ని చూపిస్తున్నాం అని దిల్ రాజు అన్నారు.

మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి శ్రీ కాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే గోదావరి తీరంలో అద్భుతమైన ప్రదేశాల్లో కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు మరియు త్వరలోనే హైదరాబాద్లో కొన్ని సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. సమంత మరియు అంజలి కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్ మరియు జయసుధ వెంకటేష్ మరియు మహేష్ బాబులకు తల్లితండ్రులుగా నటిస్తున్నారు.

Exit mobile version