తనీష్ కెరీర్లో ఇప్పటి వరకూ చెప్పుకో దగ్గ హిట్స్ ఎక్కువ లేకపోయినా తనీష్ మాత్రం వరుసగా కొత్త సినిమాలు చేస్తూనే ఉన్నాడు. తనీష్ తాజాగా రెండు సినిమాలకు ఒప్పుకున్నాడు. ‘ సుమారు 100 కథలు విన్న తర్వాత ఇప్పుడే రెండు కొత్త చిత్రాలకు సైన్ చేశాను. త్వరలోనే ఆ సినిమాల పూర్తి వివరాలు తెలియజేస్తాను’ అని తనీష్ తన ట్విట్టర్లో పేర్కొన్నారు. తనీష్ హీరోగా ఇటీవలే విడుదలైన ‘మేం వయసుకు వచ్చాం’ చిత్రానికి ప్రేక్షకుల నుండి మంచి స్పందన లబించింది మరియు ఈ చిత్రం విమర్శకుల నుండి కూడా మంచి మన్ననలు పొందింది. తనీష్ నటించిన ‘తెలుగబ్బాయి’ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. అది కాకుండా తనీష్ నటిస్తున్న ‘ఓకే’ మరియు ‘చాణక్యుడు’ అనే రెండు థ్రిల్లర్ చిత్రాలు ఈ సంవత్సరమే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ‘రైడ్’ మరియు ‘నచ్చావులే’ చిత్రాలు మాత్రమే తనీష్ కెరీర్లో చెప్పుకోదగ్గ బిగ్గెస్ట్ హిట్స్. తను రాబోయే చిత్రాలతో అయినా హీరోగా మరింత ఎత్తుకు ఎదుగుతాడా? అనే దాని కోసం ఇంకొంత కాలం ఎదురు చూడాలి.