భారీగా జరగనున్న సంతోషం అవార్డ్స్ వేడుక


సంతోషం వార పత్రిక వారు ప్రతి సంవత్సరం తెలుగు సినిమాలకు అవార్డులను అందజేస్తుంది. ఈ పత్రికను స్తాపించి పది సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ సారి సంతోషం అవార్డ్స్ వేడుకను తెలుగులోనే కాకుండా తమిళం, మలయాళం మరియు కన్నడ చిత్రాలకూ బహుకరించాలని సంతోషం పత్రిక ఆధినేత సురేష్ కొండేటి నిశ్చయించుకున్నారు. ఈ విషయాన్ని ఆయన నిన్న హైదరాబాద్లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో తెలియజేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి అధినేత తమారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ ‘ సంతోషం పత్రికను స్తాపించి సక్సెస్ఫుల్ గా పత్రికను నడుపుతూ 10 సంవత్సరాలు పూర్తిచేసుకున్నందుకు ముందుగా సురేష్ కొండేటికి నా శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా అవార్డుల వేడుక జరపడం మామూలు విషయం కాదు అలాంటిది ఈ సారి ఏకంగా సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలన్నింటికీ కలిపి అవార్డులు ఇవ్వాలని నిర్ణయించుకున్న సురేష్ కి నా అభినందనలు తెలియజేస్తున్నానని’ ఆయన అన్నారు. ఈ నెల 12న ఈ అవార్డుల వేడుక జరగనుంది, ఈ కార్యక్రమాన్ని ఎక్కడ చేయనున్నారు అనేది ఇంకా ఖరారు కాలేదు. భారీగా జరగనున్న ఈ కార్యక్రమానికి సౌత్ ఇండియన్ అతిరధమహారధులు హాజరుకానున్నారు.

Exit mobile version