కళాంజలి ప్రచారకర్తగా శృతి హాసన్


శృతి హాసన్ మరొక బ్రాండ్ కి అంబాసడర్ గా వ్యవహరించనున్నారు కళాంజలి వారికి కొత్త ప్రచార కర్తగా వ్యవహరించనున్నారు. గతంలో దీపిక పదుకొనే కళాంజలి చీరలకు ప్రచారకర్తగా వ్యవహరించారు. “గబ్బర్ సింగ్” చిత్ర భారీ విజయం తరువాత ఆంధ్రప్రదేశ్ లో శృతి హాసన్ మంచి పేరు సంపాదించుకుంది. ఈ మధ్య కాలంలో శృతి హాసన్ సంతకం చేసిన ఒకానొక పెద్ద ఒప్పందం ఇది. రాష్ట్రమంతటా శృతి హాసన్ ఉన్న కళాంజలి హోర్డింగ్లు ఏర్పాటు చేశారు. కళాంజలి చీరలకు ప్రచారకర్తగా వ్యవహరించడం శృతి హాసన్ చాలా సంతోషంగా ఉంది. ప్రస్తుతం ఈ భామ “నువ్వొస్తానంటే నేనోద్దంటానా” చిత్ర హిందీ రీమేక్ లో బిజీగా ఉంది. గిరీష్ తౌరాని ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి ప్రభుదేవా దర్శకత్వం వహిస్తున్నారు.

Exit mobile version