ఫుల్ బిజీగా ఉన్న రేగినా


“ఎస్ ఎం ఎస్” చిత్రంతో పరిచయం అయిన భామ రేగిన ప్రస్తుతం తమిళ కామెడి చిత్రం “కేడి బిల్లా కిలాడీ రంగ” చిత్రంలో నటిస్తుంది. గతంలో “పసంగ” మరియు “మరీన” వంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన పాండిరాజ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. విమల్,శివ కార్తికేయన్ మరియు బిందు మాధవి ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించనున్నారు. “కండ నాల్ మొదల్” చిత్రంతో తమిళ తెరకు పరిచయమయ్యింది కాని బాలాజీ మోహన్ తెరకెక్కించిన లఘు చిత్రంతో మంచి పేరు సంపాదించుకుంది. తరువాత కన్నడలో “సూర్య కాంతి” చిత్రంతో ప్రవేశించిన ఈ భామ తరువాత తెలుగులోకి “ఎస్ ఎం ఎస్” చిత్రంతో ప్రవేశించింది. త్వరలో సందీప్ కిషన్ సరసన “రొటీన్ లవ్ స్టొరీ” చిత్రంలో కనిపించనుంది ఇదే కాకుండా సుమంత్ మరియు వరుణ్ సందేశ్ లు ప్రధాన పాత్రలో వస్తున్న మల్టీ స్టారర్ చిత్రం “ట్విస్ట్” లో కూడా కనిపించనుంది.

Exit mobile version