ఒక అమ్మాయి ఎలాంటి గుర్తింపు లేకుండా చదువు పూర్తి చేసుకొని సాప్ట్ వేర్ ఇంజనీర్ అయ్యింది. ఆ తర్వాత రోజు ఉదయాన్నే 10 గంటలకు ఆఫీసుకి వెళ్లి ఎప్పుడు 6 గంటలవుతుందా అంటూ గడియారం వైపు చూసే ఒక మెకానికల్ లైఫ్ ని గడిపింది. ఆ నాలుగు గోడల మధ్యే ఆ కంప్యూటర్లతోనే తన జీవితాన్ని గడపాలా, నా లైఫ్ ఇంతేనా అని ఎంతో భయపడేది ఆ అమ్మాయి. కానీ అమ్మాయి జీవితం అలా జరగలేదు సరికదా సౌత్ ఇండియా మొత్తం ఫేమస్ అయిపోయింది. ఆ అమ్మాయి మరెవరో కాదు ప్రస్తుతం తెలుగు, తమిళ మరియు హిందీ సినిమాలు చేస్తూ కుర్ర కారుకి మత్తెక్కిస్తున్న అందాల భామ తాప్సీ.
నిన్న పుట్టిన రోజు జరుపుకున్న ఈ భామ ఇప్పటివరకూ జరిగిన తన లైఫ్ గురించి మాట్లాడుతూ ‘ నేను ఎంతో చురుకుగా మరియు క్రియేటివిటీ కలిగిన అమ్మాయిని, నా కెరీర్ మొదట్లో కూడా అలానే పని చెయ్యాలనుకున్నాను కానీ రోజు ఒకే రకమైన పని కావడంతో చిరాకు పడేదాన్ని. అందుకే కొత్తగా ఉంటుందని మోడలింగ్ వైపు అడుగేశాను. మోడలింగ్లో అనుకోకుండానే ఫేమస్ అయిపోయాను, దాని ద్వారా సినిమాల్లో నటించే అవకాశం వచ్చింది. ప్రస్తుతం సినిమాలు లేకపోతే ఉండలేనేమో అనేలా ఉంది నా పరిస్థితి. సెట్ లోకి వెళ్ళగానే నేను చేస్తున్న పాత్రలోకి వెళ్లిపోయి బాగా ఎంజాయ్ చేస్తాను. ప్రతి రోజూ కొత్తగా జీవించడం నాకు చాలా ఆనందాన్నిస్తుంది. వేరే వేరే జీవితాల్లో నాటో, వారి జీవితాన్ని ఎంజాయ్ చేయడం నాకు చాలా ఇష్టం అని’ ఆమె అన్నారు
తాప్సీ ఆ కంప్యూటర్లను వదిలేసి, ఇలా కెమెరా ముందుకు రావడం మాత్రం ప్రేక్షకులను ఎంతో సంతోష పెట్టే విషయం. మరి మీరేమంటారు ప్రెండ్స్..