శివ తాండవం చిత్రంలో అంధుడిగా కనిపించనున్న విక్రం


ఏ ఎల్ విజయ్ దర్శకత్వంలో త్వరలో రానున్న చిత్రం “శివ తాండవం” చిత్రంలో విక్రం ద్విపాత్రాభినయం చెయ్యనున్నారు. ఈ చిత్రంలో అయన RAW ఏజెంట్ గా కనిపించనున్నారు. మరొక పాత్ర గురించి తమిళ పరిశ్రమలో పలు చర్చలు నడుస్తున్నాయి. అయన అంధుడి పాత్రలో కనిపించనున్నారని అక్కడి వర్గాల సమాచారం. ఏ ఎల్ విజయ్ మీడియాతో మాట్లాడుతూ ఈ పాత్ర డానియల్ కిష్ చెప్పిన శబ్ధాలతో చూడటం అన్న అంశం మీద ఉండబోతుంది అన్నారు. జగపతి బాబు, ఏమి జాక్సన్ మరియు అనుష్కలు ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. తెలుగు వెర్షన్ని సి కళ్యాణ్ నిర్మిస్తున్నారు. జి వి ప్రకాష్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

Exit mobile version