కాస్త విరామం తరువాత లక్ష్మి మంచు తిరిగి బుల్లి తెర మీద కనపడటానికి సిద్దమయ్యారు. ఆమె నిర్మాణంలో వస్తున్న “లక్ ఉంటె లక్ష్మి” కార్యక్రమంలో లక్ష్మి మంచు వ్యాఖ్యాతగా కనపడబోతున్నారని ప్రకటించారు. ఈ కార్యక్రమానికి సాయి కుమార్ వ్యాఖ్యానం వహిస్తున్నారు. ” లక్ ఉంటె లక్ష్మి లో నేను కనపడబోతున్నాను చాలా రోజుల తరువాత బుల్లి తెర మీదకి రానున్నాను. ప్రతి శుక్రవారం ఈ కార్యక్రమం ప్రసారం అవ్వనుంది” అని లక్ష్మి ట్విట్టర్లో చెప్పారు. నటన మరియు నిర్మాణంలోకి రాకముందు “లక్ష్మి టాక్ షో” కార్యక్రమంతో తెలుగులో ప్రసిద్ది చెందారు. ఈ మధ్యనే లక్ష్మి నిర్మాణంలో మంచు ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద వచ్చిన “ఊ కొడతారా ఉలిక్కి పడతారా” చిత్రం గత వారం విడుదల అయ్యింది మరో చిత్రం “గుండెల్లో గోదారి” విడుదలకు సిద్దమవుతుంది. లక్ష్మి “గుండెల్లో గోదారి” చిత్రాన్ని నిర్మించడమే కాకుండా ఈ చిత్రంలో ఒకానొక ప్రధాన పాత్ర పోషించారు. ఈ చిత్రం ఈ ఏడాదే విడుదల కానుంది.