డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో హీరో మాస్ మహారాజ రవితేజ కాంబినేషన్లో వస్తున్న ‘దేవుడు చేసిన మనుషులు’ చిత్రం అన్ని హంగులతో ఆగష్టు 15న విడుదల కానుంది. చాలా రోజుల క్రితమే ఈ చిత్రం చిత్రీకరణ పూర్తి చేసుకున్నా సినిమా విడుదల చేయడానికి సరైన సమయం కోసం ఈ చిత్ర నిర్మాత ఇంతకాలం వేచి చూశారు. ఈ చిత్రంలో రవితేజ సరసన మూడవసారి గోవా బ్యూటీ ఇలియానా కథానాయికగా నటించారు.
రఘు కుంచె సంగీతం అందించిన ఈ చిత్రంలోని పాటలకు సినీ అభిమానుల నుండి మంచి ఆదరణ లబిస్తోంది. రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ సమర్పణలో బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో బ్రహ్మానందం మహా విష్ణువుగా మరియు కోవై సరళ లక్ష్మీ దేవిగా కనిపించనున్నారు.