‘మదరాసపట్నం’ అనే సినిమాతో తమిళ ప్రేక్షకులకు పరిచయమైన బ్రిటిష్ భామ ఏమీ జాక్సన్ ఆ తరువాత ఎమయ చేసావే హిందీ రీమేక్ ‘ఏక్ దీవానా థా’ సినిమాలో నటించింది కానీ ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఘోర పరాజయం చవి చూసింది. ఇప్పుడు ఈ ముద్దు గుమ్మ తెలుగులో రామ్ చరణ్ సరసన ‘ఎవడు’ అనే సినిమాలో నటిస్తోంది. వంశి పైడిపల్లి డైరెక్షన్లో తెరకెక్కనున్న ఈ సినిమా షూటింగ్లో పాల్గోనబోతున్నట్లు తన ట్విట్టర్ ఎకౌంటులో తెలిపింది. ఇదే కాకుండా తమిళంలో విక్రమ్ సరసన ‘తాండవం’ అనే సినిమాలో కూడా నటిస్తుంది.