‘సిద్ధూ ఫ్రం శ్రీకాకుళం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన శ్రద్ధా దాస్ ఆ తరువాత కొన్ని చిన్న సినిమాల్లో నటించింది. ఆర్య 2, మరో చరిత్ర, డార్లింగ్, నాగవల్లి, మొగుడు వంటి సినిమాల్లో నటించినప్పటికీ ఆమె చేసింది చిన్న పాత్రలే కావడంతో తగినంత గుర్తింపు రాలేదు. అయితే ఆమె ఇటీవలే ముంబైలో ఒక ఫ్లాట్ కొనుక్కుంది. కథానాయికగా అమ్మే ఎన్నో షాపింగ్ మాల్స్ ఓపెనింగ్ కి వెళ్లి లక్కీ హ్యాండ్ అనిపించుకున్న ఆమె ఈ రోజు తన సొంత ఫ్లాట్ లోకి గృహ ప్రవేశం చేయబోతుంది. తను కష్టార్జితంతో కొనుక్కున ఫ్లాట్ గృహప్రవేశం కి వెళుతుంటే చెప్పలేనంత ఆనందంగా ఉందని ఆమె ట్విట్టర్లో తన ఆనందాన్ని పంచుకుంది. ఆమె కొత్త ఫ్లాట్ అయినా ఆమెకు అద్రుష్టం తీసుకు రావాలని ఆశిద్దాం.