రామ్ చిత్రంలో శృతి హాసన్?

సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో రామ్ తరువాతి చిత్రం కోసం శృతి హాసన్ తో చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తుంది. కొద్ది రోజుల క్రితం రామ్ “కందిరీగ” చిత్ర దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ తో మరొక చిత్రం చేయ్యబోతున్నారని చెప్పాము. ఈ చిత్రాన్ని బెల్లంకొండ్డ సురేష్ నిర్మించబోతున్నారు. తమన్ సంగీతం అందించబోతున్నారు.ఈ చిత్రంలో ప్రధాన పాత్ర కోసం శృతి హాసన్ కోసం ప్రయత్నిస్త్తున్నట్టు తెలుస్త్తుంది ఇంకా ఆమె ఒప్పుకున్నట్టు లేదు ” దర్శకుడు వాసు, రామ్ చిత్రం కోసం శృతి డేట్స్ కోసం ప్రయత్నిస్తున్నారు ఆమె ఒప్పుకుంటే మీకు చెప్తా” అని తమన్ ట్విట్టర్ లో చెప్పారు. శృతి హాసన్ “గబ్బర్ సింగ్” చిత్రం మీద భారీగానే నమ్మకాలు పెట్టుకొని ఉన్నారు ఈ చిత్రం విడుదలయి హిట్ అయితే ఈమెకు చాలా అవకాశాలు వస్తాయి అందుకే మరో చిత్రం ఒప్పుకోవట్లేదు అని తెలుస్తుంది

Exit mobile version