ఈ సంవత్సరం తాప్సీకి కీలకం కానుంది. ఈ సంవత్సరంలో ఆమె నటించిన ఒక్క సినిమా కూడా విడుదల కాలేదు. అయితే ప్రస్తుతం ఆమె రవితేజ సరసన దరువు, ఆది సరసన గుండెల్లో గోదారి, వెంకటేష్ సరసన షాడో చిత్రాల్లో నటిస్తుంది. గుండెల్లో గోదారి చిత్రంలో ఆమె సరళ పాత్రలో నటిస్తుంది. ఈ చిత్రానికి సంబందించిన కొన్ని స్టిల్స్ నిన్న విడుదల చేయగా యువకుల నుండి, ఆమె అభిమానుల నుండి మంచి స్పందన లభించింది. సంప్రదాయమైన పదహారణాల తెలుగమ్మాయిలా ఉన్నావంటూ కితాబునిస్తున్నారు. ఆమె ఈ సినిమాలో లంగా వొణీలో సంప్రధాయబద్ధంగా ఉంది. అభిమానుల నుండి వస్తున్న ప్రశంసలకు ఆమె చాలా ఆనందంగా ఉంది.