మరో రొమాంటిక్ సాంగ్‌తో వస్తున్న ‘ఆంధ్ర కింగ్ తాలూకా’.. ఎప్పుడంటే..?

మరో రొమాంటిక్ సాంగ్‌తో వస్తున్న ‘ఆంధ్ర కింగ్ తాలూకా’.. ఎప్పుడంటే..?

Published on Oct 27, 2025 6:00 PM IST

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. దర్శకుడు పి.మహేష్ బాబు డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ ఈ మూవీపై సాలిడ్ బజ్ క్రియేట్ చేసింది. ఇక ఈ సినిమాకు వివేక్-మెర్విన్ ద్వయం సంగీతం అందిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుండి మరో క్రేజీ అప్డేట్ వచ్చింది.

ఈ సినిమా నుంచి మూడో సింగిల్ సాంగ్‌గా ఓ రొమాంటిక్ పాటను మేకర్స్ రిలీజ్ చేయబోతున్నారు. ‘చిన్ని గుండెలో’ అంటూ సాగే ఈ పాటలో హీరో రామ్ పోతినేని, హీరోయిన్ భాగ్యశ్రీ బొర్సె ల మధ్య వచ్చే కెమిస్ట్రీ ప్రేక్షకులను థ్రిల్ చేయబోతుందని మేకర్స్ చెబుతున్నారు. ఈ రొమాంటిక్ సాంగ్‌ను అక్టోబర్ 31న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ తాజాగా ఓ పోస్టర్ ద్వారా ప్రకటించారు.

ఇక ఈ సినిమాలో కన్నడ స్టార్ ఉపేంద్ర ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, టీ-సిరీస్ బ్యానర్లు సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నాయి. ఈ చిత్రాన్ని నవంబర్ 28న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.

తాజా వార్తలు