విడుదల తేది : 14 మార్చి 2014 | ||
123తెలుగు .కామ్ రేటింగ్ : 2.5/5 | ||
దర్శకత్వం : భూపతి పాండ్యన్ | ||
నిర్మాత : విశాల్ కృష్ణ | ||
సంగీతం : ఎస్ ఎస్ తమన్ | ||
నటినటులు : విశాల్, ఐశ్వర్య అర్జున్ |
స్వీయ నిర్మాణంలో యాక్షన్ హీరో విశాల్ నటించిన సినిమా ‘ధీరుడు’. ఈ సినిమాకి దర్శకుడు భూపతి పాండ్యన్. విశాల్ సరసన ఐశ్వర్య అర్జున్ హీరోయిన్ గా నటించింది. ఎస్ ఎస్ తమన్ సంగీతం సమకూర్చిన ఈ సినిమా, ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా విడుదలైంది. ఇప్పుడు ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం.
కథ :
ఓపెన్ చేస్తే, ఒక్క పల్లెటూరి లో సాంబార్ శివ (విశాల్) ఓ వంటవాడు. అతని కేటరింగ్ బృందం ఒక్క రౌడీ పెళ్లిలో వంటలు చేయడానికి ఒప్పుకుంటారు. అయితే ఈ పెళ్లి లో శివ అతని బృందం పెళ్లికోడుకైన రౌడీతో గొడవ పెట్టుకుని, ఆ తరువాత భయంతో ఊరి నుండి పారిపోతారు. ఒక్క పెద్ద హోటల్ పెట్టుకుందామని విజయవాడ చేరుకుంటారు. ఇక్కడే శివకి ఐశ్వర్యతో (ఐశ్వర్య అర్జున్) పరిచేయం ఏర్పడుతుంది.
ఇదే ఊరిలో, ఎప్పటి నుండో రెండు గ్రూపుల మధ్య గొడవలు జరుగుతుంటాయి. అనుకోకుండా ఓ భువివాదం కారణంగా శివ, ఐశ్వర్య ఇద్దరు రెండు గ్రూపులలో ఒక్క గ్రూపుతో గొడవ పడాల్సి వస్తుంది. ఆ తరువాత ఏం జరిగింది? వాళ్ళు ఈ గొడవల నుండి ఎలా భయట పడుతారో తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ప్లస్ పాయింట్స్ :
ఈ సినిమాలో చెప్పుకోదగిన ప్లస్ పాయింట్స్ లేకపొయినప్పటికి, యాక్షన్ ఎపిసోడ్స్ మాత్రం ప్రేక్షకులని ఓ మాదిరిగా ఆకట్టుకుంటాయి. ఫస్ట్ హాఫ్ లో చాల నెమ్మదిగా నడిచే సినిమాని సెకండ్ హాఫ్ లో వేగం పెంచి ఆసక్తికరంగా మార్చడంలో దర్శుకుడు సక్సెస్ అయ్యాడనే చేపోచ్చు. తన అన్ని సినిమాలలో లాగానే విశాల్ యాక్షన్ సీన్స్ లో బాగా చేసాడు. కమెడియన్ సంతానం తన పాత్రకు న్యాయం చేసాడు. హీరోయిన్ ఐశ్వర్య తనకు ఉన్నవి కొన్ని సీన్సే అయినప్పటికీ బాగానే నటించింది.
మైనస్ పాయింట్స్
ఫస్ట్ హాఫ్ లో ఈ సినిమా స్క్రీన్ప్లే చాలా చాలా నెమ్మదిగా ఉంటుంది. కమెడియన్ సంతానం ఉన్న సీన్స్ చాలా వరకు లాగినట్టుగా ఉంటాయి. అసలే చాలా స్లో గా ఉన్న సమయంలో, పాటలు ప్రేక్షకులని ఇంకా ఇబ్బందికి గురిచేస్తాయి. ఫస్ట్ హాఫ్ లో ఎడిటింగ్ పై కాస్త దృష్టి పెట్టి ఉంటే బాగుండేది. దర్శుకుడు సెకండ్ హాఫ్ మరియు యాక్షన్ సీన్స్ పైనే ఎక్కువ శ్రద్ధ వహించినట్టు అనిపిస్తుంది. ఈ సినిమాలో పాటలు కూడా వీక్షకులను అలరించ లేకపోతున్నాయి.
సాంకేతిక విభాగం :
టెక్నికల్ పరంగా ఈ సినిమా ఫస్ట్ హాఫ్ సంతృప్తిగా లేకపొయిన్నప్పటికి, సెకండ్ హాఫ్ బాగుంది. సినిమా మొదటి బాగం లో ఎడిటర్ కాస్త శ్రద్ధ వహించి ఉంట్టే బాగుండేది. ఇక కెమెరా వర్క్ కి వస్తే, తనకు ఇచ్చిన లొకేషన్స్ ని సినిమాటోగ్రాఫర్ ఎస్ వైధీ బాగానే చూపించాడని చెప్పుకోవచ్చు. కెమెరా వర్క్ సెకండ్ హాఫ్ యాక్షన్ ఎపిసోడ్స్ లో చాలా బాగుంది. తమన్ పాటలు ప్రేక్షకులను హాల్ లో నుండి వెళ్ళకుండా ఆపలేకపోతున్నాయి. క్లైమాక్స్ లో తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది.
తీర్పు :
విశాల్ మొదటి సారి నిర్మాతగా పరిచేయం అవుతున్న ‘ధీరుడు’ ప్రేక్షకులను మెప్పించలేకపొయింది. ఇంటర్వెల్ వరకు ఈ సినిమా చాలా నెమ్మదిగా సాగుతుంది. చాలా సాధారణమైన కథతో ప్రతి సన్నివేశాన్ని ముందుగానే ఊహించగలిగేలా ఉంటుంది. మీకు తమిళ్ ఆక్షన్ సినిమాలు నచ్చితే, దానితో పాటు చాలా ఓపిక ఉంట్టే ఈ సినిమాకి వెళ్ళవచ్చు.
123తెలుగు. కామ్ రేటింగ్ : 2.5/5
123తెలుగు టీం