‘మార్కో’ హీరోతో మోడీ బయోపిక్.. ‘మా వందే’ గా భారీ అనౌన్సమెంట్!

‘మార్కో’ హీరోతో మోడీ బయోపిక్.. ‘మా వందే’ గా భారీ అనౌన్సమెంట్!

Published on Sep 17, 2025 12:00 PM IST

narendra modi

ప్రస్తుత భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 75 వ పుట్టినరోజు సందర్భంగా అనేకమంది సినీ సహా రాజకీయ ప్రముఖులు తనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్న సంగతి తెలిసిందే. ఇక వాటితో పాటుగా ఓ భారీ అనౌన్సమెంట్ కూడా ఇపుడు వచ్చింది. నరేంద్రమోడీ బయోపిక్ ని సిల్వర్ కాస్ట్ క్రియేషన్స్ వారు ఒక పాన్ వరల్డ్ సినిమాగా గ్రాండ్ అనౌన్సమెంట్ ని అందించారు.

మలయాళ టాలెంటెడ్ హీరో ఉన్ని ముకుందన్ నరేంద్రమోడీ పాత్రని చేయనుండగా ఒక ఇంట్రెస్టింగ్ ప్రీ లుక్ పోస్టర్ తో “మా వందే” అనే టైటిల్ ని రివీల్ చేశారు. ఇక ఇందులో ‘ఎన్నో పోరాటాల కన్నా తల్లి సంకల్పం గొప్పది’ అనే నరేంద్రమోడీ మాట ట్యాగ్ లైన్ గా కనిపిస్తుంది.

మరి ఈ సినిమాని ప్రధాన పాన్ ఇండియా భాషల్లోనే కాకుండా ఇంగ్లీష్ లో కూడా రిలీజ్ చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. ఇక ఈ చిత్రాన్ని క్రాంతి కుమార్ సి హెచ్ దర్శకత్వం వహించనుండగా రవి బసృర్ సంగీతం అందిస్తున్నారు అలాగే కేకే సెంథిల్ కుమార్ ఈ సినిమాకి కెమెరా వర్క్ అందిస్తుండడం విశేషం. ఇలా ప్యాకెడ్ గా ఈ ప్రాజెక్ట్ ని మేకర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్లాన్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు