టాలీవుడ్ ప్రముఖ నటుడు మరియు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం జోడెద్దుల ప్రయాణం చేస్తున్నారు. అయితే ఈ క్రమంలో పవన్ కు భారతదేశ ప్రభుత్వం Z క్యాటగిరీ భద్రతను కల్పించడం మొత్తం సినీ మరియు పొలిటికల్ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. పవన్ కు కల్పించిన ఈ భద్రతలో పర్సనల్ గా 22 మంది జాతీయ స్థాయి కమాండోలను ప్రకటించడం గమనార్హం.
అయితే పవన్ పలు ప్రాంతాలకు పర్యటన చేయనుండగా అందుకోసమే అంత పటిష్టమైన భద్రతను ఇచ్చారని తెలుస్తుంది. కానీ పవన్ ఎన్నికల్లో ఎలాంటి ఫలితాన్ని అందుకున్నారో తెలిసిందే. అయినప్పటికీ పవన్ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇంత ఇంపార్టెన్స్ ఇవ్వడం ఆసక్తిరంగా మారింది. ప్రస్తుతం పవన్ నటించనున్న “వకీల్ సాబ్” షూట్ తిరిగి మళ్ళీ పునః ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. దీని తర్వాత క్రిష్ తో ప్రాజెక్ట్ ను కూడా రీ స్టార్ట్ చెయ్యనున్నారు.