జూలై 22న “ఎటో వెళ్లిపోయింది మనసు” టీజర్ విడుదల


గౌతం మీనన్ “ఎటో వెళ్లిపోయింది మనసు” చిత్ర టీజర్ జూలై 22 న విడుదల చెయ్యనున్నారు. ఈ ప్రేమకథా చిత్రంలో నాని మరియు సమంత ప్రధాన పాత్రలలో కనిపించనున్నారు.తాజా సమాచారం ప్రకారం ఇళయరాజా స్వరపరచిన “ఏది ఏది” పాటతో కూడిన 30 సెకన్ల టీజర్ ని విడుదల చెయ్యనున్నారు. ఈ టీజర్ గురించి నాని మాట్లాడుతూ ” ఎటో వెళ్లిపోయింది మనసు చిత్రంలో “ఏది ఏది” పాటతో కూడిన 30 సెకన్ల టీజర్ ని జూలై 22 ఆదివారం రోజున విడుదల చెయ్యనున్నారు. ఈ పాట మిమ్మల్ని మళ్ళి ప్రేమలో పడేలా చేస్తుంది” అని అన్నారు. ఈ చిత్ర ప్రధాన భాగ చిత్రీకరణ దాదాపుగా పూర్తయ్యింది. త్వరలో ఈ చిత్ర ఆడియోని విడుదల చెయ్యనున్నారు. గౌతం మీనన్ ఈ చిత్రాన్ని తెలుగు మరియు తమిళంలో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం కోసం మొదటిసారిగా గౌతం మీనన్ మరియు ఇళయరాజా కలిసి పని చేస్తున్నారు ఈ చిత్రం లో పాటలు అందరిని ఆకట్టుకుంటాయని అంటున్నారు. ఈ చిత్రం ఈ ఏడాదే విడుదల కానుంది.

Exit mobile version