యువన్ శంకర్ రాజ తన తండ్రి ఇళయరాజా, గౌతం మీనన్ రాబోతున్న చిత్రం “ఎటో వెళిపోయింది మనసు” చిత్రానికి అందించిన సంగీతం గురించి మాట్లాడకుండా ఉండలేకపోతున్నారు. ఈ ప్రముఖ సంగీత దర్శకుడు ఈ చిత్రం తమిళ వెర్షన్ “నీదానే ఎన్ పోన్ వసంతం” లో ఒక పాటను కూడా పాడారు. ఈ చిత్రంలో ఒకానొక పాటను విన్న తరువాత అయన ఇలా స్పందించారు ” సైందు సైందు పాట నన్ను వదలట్లేదు ఇంత మంచి పాటలో నేను భాగం అయినందుకు చాలా ఆనందంగా ఉంది ఫైనల్ వెర్షన్ వింటుంటే చాలా ఆనందంగా ఉంది ఆ పాట నా చేత పాడించినందుకు గౌతంకి నేను కృతజ్ఞతలు చెప్పాలి. మేమంతా సంగీత దర్శకులం మాత్రమే మా నాన్న సంగీతాన్ని సృష్టిస్తాడు ” అని ట్విట్టర్లో చెప్పారు. ఈ చిత్ర తమిళ వెర్షన్లో జీవ మరియు సమంత నటించగా తెలుగు వెర్షన్లో నాని మరియు సమంత కనిపించనున్నారు. ఇళయరాజా ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు ఈ చిత్రం ఈ సెప్టెంబర్ లో విడుదలయ్యే అవకాశాలున్నాయి.