తమ్మారెడ్డి భరద్వాజ్ ఈరోజు జరిగిన ప్రెస్ మీట్ లో పైరసీ మీద ధ్వజమెత్తారు. ఈ ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ తమ్మారెడ్డి భరద్వాజ ఇలా అన్నారు ” ఈ మధ్య కాలంలో కొత్త చిత్రాలను చాలా మంది పైరసీ చేస్తున్నారు. పైరసీ వలన చిత్రాల ఉనికి ప్రమాదకరంగా మారింది” అని అన్నారు. ఆంధ్రప్రదేశ్ యాంటి పైరసీ సెల్ వారు “నాయక్” చిత్రాన్ని పైరసీ చేసిన ఒక యువకుడిని అరెస్ట్ చేశారు. “అతను తన తప్పుని తెలుసుకొని మాకు లొంగిపోయాడు. అందుచేత అతన్ని హెచ్చరించి వదిలేశాము. కాని భవిష్యత్తులో ఇది జరిగితే వదిలేది లేదు. ఇటువంటి నేరాలలో యువత దూరంగా ఉండటం మంచిది” అని తమ్మారెడ్డి భరద్వాజ్ అన్నారు. ఈ సంక్రాంతికి బాక్స్ ఆఫీస్ వద్ద “సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు” మరియు “నాయక్” వంటి చిత్రాలు ఉండటంతో ఈ చిత్రాల పైరసీ ని యాంటి పైరసీ సెల్ అరికట్టడానికి ప్రయత్నిస్తుంది.