యంగ్ హీరోకి స్టార్ డైరెక్టర్ కావాలట !

యంగ్ హీరోకి స్టార్ డైరెక్టర్ కావాలట !

Published on Oct 12, 2020 8:20 AM IST

సందీప్ కిషన్ లాస్ట్ సినిమా తెనాలి రామకృష్ణతో ప్లాప్ అందుకున్నా.. అంతకుముందు సినిమా ‘నిన్ను వీడని నీడను నేనే’ అనే సినిమాతో చిన్న రేంజ్ హిట్ అందుకున్నాడు. అయితే తాను కోరుకున్న హిట్ రేంజ్ ను మాత్రం అందుకోలేకపోయాడు సందీప్. అందుకే ప్రస్తుతం తన తరువాత సినిమాలను చాల జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నాడట. ఓ స్టార్ డైరెక్టర్ తో ఒక సినిమా చేయాలి అని సందీప్ కిషన్ ప్లాన్ చేసుకుంటున్నాడట. ఎప్పుడైతే విజయ్ దేవరకొండ – సుకుమార్ కాంబినేషన్ అని ఎనౌన్స్ చేశారో.. అప్పటి నుండి మిగిలిన యంగ్ హీరోలు కూడా అలాంటి కాంబినేషన్ కోసం ఎదురుచూస్తున్నారట.

కాగా ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’ లాంటి ఫుల్ ఎంటర్ టైనర్ తో మంచి హిట్ అందుకున్న సందీప్ కిషన్, మళ్లీ ఆ తరువాత ఆ స్థాయిలో కామెడీ సినిమా ఇంతవరకూ చేయలేదు. మళ్ళీ అలాంటి ఫుల్ అండ్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ సినిమా చేయాలనీ.. అలాగే ఆ సినిమాకి స్టార్ డైరెక్టర్ అయి ఉండాలని సందీప్ ప్రయత్నాలు మొదలుపెట్టాడట.

తాజా వార్తలు