ఓటీటీలో ‘కింగ్డమ్’ రూల్ చేసేందుకు రెడీ అయిన విజయ్ దేవరకొండ..!

ఓటీటీలో ‘కింగ్డమ్’ రూల్ చేసేందుకు రెడీ అయిన విజయ్ దేవరకొండ..!

Published on Aug 25, 2025 4:00 PM IST

రౌడీ స్టార్ విజయ్ దేవరకొం నటించిన రీసెంట్ మూవీ కింగ్డమ్ భారీ అంచనాల మధ్య రిలీజ్ అయింది. ఈ సినిమాను దర్శకుడు గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేయగా పూర్తి యాక్షన్ డ్రామాగా ఈ సినిమా ప్రేక్షకులను అలరించడంలో తడబడింది. ఇక ఈ సినిమా కోసం విజయ్ భారీ మేకోవర్ చేశాడు. ఈ సినిమాపై ఆయన కూడా చాలా నమ్మకం పెట్టుకున్నాడు.

ఇక బాక్సాఫీస్ దగ్గర మోస్తరు విజయాన్ని అందుకున్న ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. జూలై 31న బాక్సాఫీస్ దగ్గర రిలీజ్ అయిన ఈ సినిమా నెల రోజుల లోపే ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చేస్తోంది. ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ ఈ చిత్ర ఓటీటీ రైట్స్‌ను ఫ్యాన్సీ రేటుకు దక్కించుకుంది. ఇక ఈ వినాయక చవితి పండుగ నాడు ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్‌కు వచ్చేస్తుందని నెట్‌ఫ్లిక్స్ తాజాగా ప్రకటించింది.

ఈ సినిమాలో విజయ్ దేవరకొండతో పాటు నటుడు సత్యదేవ్ మరో కీలక పాత్రలో నటించాడు. అందాల భామ భాగ్యశ్రీ బొర్సె హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాకు అనిరుధ్ సంగీతం అందించగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చున్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా ప్రొడ్యూస్ చేశారు.

తాజా వార్తలు