ఎన్టీఆర్ సినిమాలో యంగ్ హీరో ?

ఎన్టీఆర్ సినిమాలో యంగ్ హీరో ?

Published on Feb 13, 2021 7:13 PM IST

ఎన్టీఆర్ తో ‘అయినను పోయి రావలె హస్తినకు’ అంటూ త్రివిక్రమ్ పాన్ ఇండియా మూవీని భారీగా ప్లాన్ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సినిమాలో ఎన్టీఆర్ కి ఫ్రెండ్ క్యారెక్టర్ ఉందని.. దానికోసం యంగ్ హీరో నవీన్ పోలిశెట్టిని తీసుకోబోతున్నారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అన్నట్లు ఈ సినిమాలో కమెడియన్ సునీల్ కూడా విలన్ గా నటించబోతున్నాడని కూడా ఇప్పటికే వార్తలు వచ్చాయి.

ఇక ఈ సినిమాలో ఆధ్యాత్మిక టచ్ కూడా ఉంటుందట. అలాగే ఈ మధ్యలో తారక్ పాత్ర రాజకీయ నేపథ్యంలోకి అడుగు పెడతాడని, నేటి రాజకీయాలలో ప్రజలు ఎలా బఫూన్ అవుతున్నారనే విషయాన్ని కూడా వ్యంగ్యంగా చెబుతూ త్రివిక్రమ్ ఈ సినిమాని నడిపిస్తాడని తెలుస్తోంది. త్రివిక్రమ్ సినిమా అంటేనే భారీ తనం ఉంటుంది. పైగా వరుసగా ఆరు సినిమాలతో ఫుల్ సక్సెస్ లో ఉన్న ఎన్టీఆర్ తో సినిమా అంటే, ఇక ఏ రేంజ్ లో సినిమా ఉంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు