కన్ఫామ్ అయిన ‘ఎవడు’ ప్రీమియర్ షో

Yevadu
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘ఎవడు’ సినిమా హైదరాబాద్ లో ఒక రోజు ముందుగా ప్రిమియర్ షో వేయనున్నారని తాజా సమాచారం. ఈ సినిమా ప్రిమియర్ షోని జనవరి 11వ తేది రాత్రి మూసాపేట్ లోని శ్రీ రాములు థియేటర్ లో వేయనున్నారు. ఈ షో కోసం నిర్వాహకులు కావలసిన ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ సినిమా రాష్ట్ర వ్యాప్తంగా జనవరి 12 న విడుదలవుతోంది. ఈ సినిమాలో రామ్ చరణ్ హీరోగా శృతి హసన్, అమీ జాక్సన్ హీరోయిన్స్ గా నటించారు. ఈ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ సినిమాలో అల్లు అర్జున్, కాజల్ అగర్వాల్ అతిధి పాత్రలో నటించారు. ఈ మధ్య రామ్ చరణ్, కాజల్ పై చిత్రీకరించిన ‘చెలియా చెలియా’ సాంగ్ విడుదల చేశారు. దీనికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ‘ఈ పాటలో నటించడం చాలా సంతోషాన్ని కలిగించింది. ఇది నా ఫేవరేట్ స్పెషల్ అప్పిరియన్స్ ‘ అని కాజల్ తెలియజేసింది. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ సినిమాని దిల్ రాజు నిర్మించాడు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించాడు.

Exit mobile version