ఎవడు చిత్రం అక్టోబర్ 31న రానుందా??

ఎవడు చిత్రం అక్టోబర్ 31న రానుందా??

Published on Oct 3, 2013 12:56 AM IST

Yevadu1

రామ్ చరణ్ నటించిన ‘ఎవడు’ చిత్రం అనుకోని కారణాల వలన తరుచూ వాయిదాపడుతుంది. విడుదలకు కావాల్సిన అన్ని పనులను ముగించుకుని ఈ చిత్రం ముందుగా 31జూలై న మన ముందుకు రావడానికి సిద్ధమయ్యింది.

అయితే ‘అత్తారింటికి దారేది’ సినిమా ముందుగానే విడుదలకావడం, ‘దసరా’ ను పురస్కరించుకుని కొన్ని పెద్ద సినిమాలు బరిలో వుండడంతో అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఈ సినిమా అక్టోబర్ 31కి విడుదలచెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు. అప్పటికే ఈ పెద్ద సినిమాలు విడుదలై మూడు వారాలు దాటుతుంది గనుక ఈ సినిమా భారీ విడుదలకు ఢొకా వుండదు.

ఈ సినిమాలో శృతిహాసన్ మరియు ఎమి జాక్సన్ హీరోయిన్స్. వంశీ పైడిపల్లి దర్శకుడు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించాడు.

తాజా వార్తలు