మగధీర తర్వార చరణ్ బెస్ట్ ఓపెనింగ్స్ ఎవడు – దిల్ రాజు

మగధీర తర్వార చరణ్ బెస్ట్ ఓపెనింగ్స్ ఎవడు – దిల్ రాజు

Published on Jan 21, 2014 5:00 PM IST

Dil-Raju
ప్రస్తుతం దిల్ రాజు చాలా హ్యాపీగా ఉన్నాడు. చాలా కాలం ఆలస్యం అయినప్పటికీ ‘ఎవడు’ సినిమా విడుదలై మంచి కలెక్షన్స్ ని రాబట్టుకోవడమే కాకుండా సంక్రాంతి విన్నర్ గా నిలిచింది. ఈ సందర్భంగా ఈ రోజు దిల్ రాజు, శృతి హాసన్, వంశీ పైడిపల్లి ప్రెస్ మీట్ పెట్టి పాత్రికేయ మిత్రులతో తమ ఆనందాన్ని పంచుకున్నారు.

‘మగధీర తర్వాత రామ్ చరణ్ కెరీర్లో బెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టుకున్న సినిమా ‘ఎవడు’. అది కూడా మా బ్యానర్ లో వచ్చిన సినిమా ద్వారా ఈ ఘనత సాధించడం చాలా ఆనందంగా ఉంది. సినిమాలో సత్తా ఉంటే సంక్రాంతి లేదా సమ్మర్ అనే సీజన్ ఉండదని ఎప్పుడైనా సినిమా ఆడుతుందని’ అన్నాడు.

అలాగే శృతి హాసన్ కూడా కొన్ని ఆసక్తికరమైన కామెంట్స్ చేసింది. ‘చూడటానికి దిల్ రాజు ఒక హీరోలా కనిపిస్తాడు. అలాగే అతని సినిమా పట్ల ఇష్టం మాటల్లో చెప్పలేనిది. దిల్ రాజు గారి బ్యానర్ లో నాకు ఇది మూడవ సినిమా. సినిమా కోసం చాలా కష్ట పడ్డాను. ముఖ్యంగా చరణ్ తో సమానంగా డాన్సులు వేయడం కాస్త కష్టమైన పని. 2014 స్టార్టింగ్ ఇంత పాజిటివ్ ఎనర్జీ ఇచ్చినందుకు చాలా ఆనందంగా ఉందని’ తెలిపింది.

తాజా వార్తలు