ట్విస్ట్లతో నిండిన ఎవడు ద్వితీయార్ధం

ట్విస్ట్లతో నిండిన ఎవడు ద్వితీయార్ధం

Published on Jul 17, 2013 3:50 AM IST

Yevadu
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ‘ఎవడు’ సినిమా త్వరలో విడుదలకు సిద్ధంగావుంది. ఈ సినిమా ఒక వైవిధ్యమైన థ్రిల్లర్ కధాంశంతో తెరకెక్కుతుంది. మాకందిన సమాచారం ప్రకారం ఈ సినిమా ద్వితీయార్ధంను ట్విస్ట్లతో, సర్ప్రైజులతో నింపేసారంట. అల్లు అర్జున్ ఒక ముఖ్యపాత్రలో కనిపించనున్నాడు

వంశీ పైడిపల్లి దర్శకుడు. దిల్ రాజు నిర్మాత. శృతి హాసన్ అమీ జాక్సన్ హీరోయిన్స్. ఈ సినిమా విజయంపై దర్శకుడు నమ్మకంగా వున్నాడు.

ఈ ట్విస్ట్లు ‘ఎవడు’ చూస్తున్న ప్రేక్షకులను ఆకట్టుకుంటాయా? మంచి చిత్రాలను ఆదరించే గుణం మన ప్రేక్షకులకు వుంది గనుక ఈ సినిమా విజయం సాధించాలని ఆశిద్దాం. ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు

సంబంధిత సమాచారం

తాజా వార్తలు