పిక్ టాక్ : యూఎస్ కాన్సులేట్‌లో ఎన్టీఆర్.. డ్రాగన్ కోసమే..!

పిక్ టాక్ : యూఎస్ కాన్సులేట్‌లో ఎన్టీఆర్.. డ్రాగన్ కోసమే..!

Published on Sep 16, 2025 8:41 PM IST

మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దర్శకుడు ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో తన నెక్స్ట్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ తీవ్రంగా కష్టపడుతున్నాడు. అయితే, ఆయన తాజాగా హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్‌లో ప్రత్యక్షమయ్యారు.

ఈ మేరకు హైదరాబాద్‌లోని అమెరికా కాన్సుల్‌ జనరల్‌ లారా విలియమ్స్‌ ఎన్టీఆర్‌తో కలిసి మాట్లాడారు. ఎన్టీఆర్‌కు ఆమె స్వాగతం పలికారు. ఎన్టీఆర్ నెక్స్ట్ చిత్రం అమెరికాలో షూటింగ్ జరుపుకుంటుందని.. ఆయన సినిమా ప్రేక్షకులు ఆకట్టుకోవాలని ఆమె ఈ సందర్భంగా కోరారు.

అమెరికా- ఇండియా పార్ట్‌నర్‌షిప్, జాబ్స్ క్రియేషన్స్, ఇరు దేశాల మధ్య బంధం బలపడనుందని యూఎస్ కాన్సుల్‌ జనరల్‌ లారా ఇ.విలియమ్స్‌ పేర్కొన్నారు. ఎన్టీఆర్ సినిమాల ద్వారా ప్రేక్షకులను అలరించడమే కాకుండా పలువురికి ఉద్యోగం, స్థానిక బిజినెస్‌కు బూస్ట్ ఇవ్వడం జరగుుతందని ఆమె ఈ సందర్భంగా తెలిపారు. ఇక ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు మెరుగుపరిచేందుకు, వ్యాపారం జరిగేందుకు సినిమాలు కూడా దోహద పడుతున్నాయని ఆమె తెలిపారు. కాగా, ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ‘డ్రాగన్’ సినిమా కోసం ఎన్టీఆర్ త్వరలో అమెరికా వెళ్లనున్నాడు.

తాజా వార్తలు