గురువుతో ఇండస్ట్రీ హిట్ కొట్టిన యష్ శిష్యుడితో ప్లాన్ చేశాడట.

హీరో యష్ కెజిఎఫ్ 2 షూటింగ్ దాదాపు పూర్తి చేశాడు. కేవలం ఓ 20 రోజుల షూటింగ్ మిగిలివున్న నేపథ్యంలో త్వరలో పూర్తి చేయనున్నారు. సెప్టెంబర్ కల్లా అన్నీ కార్యక్రమాలు పూర్తి చేసి.. చెప్పిన విధంగా అక్టోబర్ 23న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు యష్ తాజా ఇంటర్వ్యూలో చెప్పారు.

కాగా యష్ తన నెక్స్ట్ మూవీ ఓ యంగ్ డైరెక్టర్ కమిటైయ్యాడట. కన్నడ డైరెక్టర్ నార్తన్ తో ఆయన తన నెక్స్ట్ మూవీ ఓకే చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే వీరి మధ్య చర్చలు జరుగగా యష్ స్క్రిప్టు పట్ల సంతృప్తి వ్యక్తం చేశాడట. మరి ఈ ప్రాజెక్ట్ ఓకే అయితే 2021లో సెట్స్ పైకి వెళుతుంది. ఇక 2017లో వచ్చిన మఫ్టీ చిత్రానికి నార్తన్ దర్శకత్వం వహించారు. ఆ సినిమా ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టింది. అలాగే నార్తన్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు.

Exit mobile version