పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘హరిహర వీరమల్లు’ కోసం ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు క్రిష్, జ్యోతికృష్ణ కలిసి డైరెక్ట్ చేయడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా నెలకొన్నాయి.
ఇక ఈ సినిమా నుంచి ఎప్పుడెప్పుడు ఎలాంటి అప్డేట్స్ వస్తాయా అని అందరూ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే, ఈ చిత్ర రిలీజ్ డేట్ పై నెలకొన్న సంధిగ్ధతతో అభిమానుల్లో ఆందోళన నెలకొంది. అయితే, ఈ అనుమానాలను తొలగించేందుకు చిత్ర యూనిట్ తాజాగా మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ అప్డేట్తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయింది.
ఈ చిత్ర వరుస అప్డేట్స్తో వచ్చేందుకు సిద్ధమైందని.. ఇక మొదలెడదామా.. అంటూ సమయాన్ని కూడా ఫిక్స్ చేశారు మేకర్స్. జూన్ 21న ఉదయం 7.23 గంటలకు ఈ చిత్రానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ఇవ్వబోతున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. దీంతో ఈ సినిమా నుంచి రాబోయే ఈ లేటెస్ట్ అప్డేట్ ఏమిటా అనేది ఆసక్తికరంగా మారింది. ఇక ఈ సినిమాలో అందాల భామ నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తుండగా ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తున్నాడు.
Ok let’s Start……
Tomorrow at 7:23AM….#HariHaraVeeraMallu ???? pic.twitter.com/75thf6arrA
— Hari Hara Veera Mallu (@HHVMFilm) June 20, 2025