‘కుబేర’ పై ‘కల్కి’ దర్శకుడు మాస్ రివ్యూ వైరల్!

లేటెస్ట్ గా మన టాలీవుడ్ నుంచి రిలీజ్ కి వచ్చిన ట్రూ పాన్ ఇండియా చిత్రమే “కుబేర”. దర్శకుడు శేఖర్ కమ్ముల, ధనుష్, నాగార్జున కలయికలో వచ్చిన ఈ సినిమాకి మొదటి ఆట తోనే సాలిడ్ రిపోర్ట్స్ మొదలయ్యాయి. ముఖ్యంగా కమ్ముల దర్శకత్వం, ధనుష్ ల పెర్ఫామెన్స్ లకి క్రేజీ రెస్పాన్స్ వస్తుంది. అయితే ఈ సినిమాకి సినీ ప్రముఖులు నుంచి కూడా గట్టి ప్రశంసలు వస్తున్నాయి.

ఇక ఈ సినిమా చూసిన యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు, కల్కి 2898 ఏడి తో పాన్ ఇండియా బాక్సాఫీస్ షేక్ చేసిన నాగ్ అశ్విన్ ఇచ్చిన మాస్ రివ్యూ వైరల్ గా మారింది. తన ఎగ్జైట్మెంట్ ఏ లెవెల్లో ఉందంటే మాస్టర్ ఫ..గ్ పీస్ అంటూ వైట్ చేయకండి జస్ట్ వెళ్లి చూసేయ్యండి అంటూ తన ఇన్స్టా స్టోరీ గా నాగ్ అశ్విన్ సింగిల్ లైన్ లో చెప్పేయడం క్రేజీగా మారింది. మొత్తానికి మాత్రం కుబేర సెన్సేషన్ ని కొనసాగిస్తోంది అని చెప్పొచ్చు.

Exit mobile version