రానక్ అనే టైటిల్ తో స్వరబ్రహ్మ ఏ.ఆర్ రెహమాన్ తన కొత్త ఆల్బమ్ ను మనకు అందించడానికి సిద్ధమయ్యాడు. గతకొన్నాళ్లుగా ఈ సంగీతదర్శకుడు ఈ ఆల్బమ్ కోసం కష్టపడుతున్నాడు. అదే క్రమంలో దీనికి వీడియో కూడా తీసేశాడు
ఈ వీడియో తెరకెక్కించడానికి రాజా రవివర్మ గీసిన పెయింటింగ్స్ నుండి స్పూర్తి పొందాడట. అంతేకాక ఈ వీడియోలో యామి గౌతం కు కూడా స్థానం కల్పించాడు. ఇంకా ఈ భామ ఆనందానికి అవధులు లేవనే చెప్పాలి. రెహమాన్ గతకొన్ని సంవత్సరాలుగా సొంత ఆల్బమ్ లు చేయడం లేదు. దీనికి కారణం ఆతను అంగీకరించిన సినిమాలే కారణమట. ‘ఆభి ఝా’ అంటూ సాగే ఒక పాట త్వరలో విడుదలచెయ్యనున్నారు. ఈ పాటకు యూనియన్ మినిస్టర్ కపిల్ సిబాల్ లిరిక్స్ ను అందించాడు
యామి గౌతం త్వరలో ప్రభుదేవా కొత్త సినిమాలో నటించనుంది. నితిన్ కొరియర్ బాయ్ కళ్యాణ్ లో కూడా హీరోయిన్ గా మెరుస్తుంది