టాలీవుడ్లో ఇటీవల వచ్చిన ‘జూనియర్’ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విజయం సాధించింది. ఈ సినిమాను రాధాకృష్ణ రెడ్డి డైరెక్ట్ చేయగా పూర్తి యూత్‌ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్గా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో కిరీటి రెడ్డి హీరోగా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇక యంగ్ బ్యూటీ శ్రీలీల ఈ సినిమాలో హీరోయిన్గా నటించింది.
ఈ సినిమాకు రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం మేజర్ అసెట్‌గా నిలిచింది. ఇక థియేటర్లలో ప్రేక్షకులను అలరించిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్కు రెడీ అయింది. ఈ చిత్రాన్ని ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహాలో సెప్టెంబర్ 30 నుంచి స్ట్రీమింగ్ చేస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు.
ఈ చిత్రానికి ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ దక్కుతుందా అనేది ఆసక్తికరంగా మారింది. ఇక ఈ సినిమాలో జెనీలియా కమ్ బ్యాక్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని వారాహి చలనచిత్రం బ్యానర్‌పై సాయి కొర్రపాటి ప్రొడ్యూస్ చేశారు.