ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న కొత్త హీరోయిన్స్ లో యామి గౌతం కూడా తన టాలెంట్ ని నిరూపించుకుంది. ఆమె గతంలో డీసెంట్ హిట్స్ అందుకొని పాపులారిటీ తెచ్చుకుంది. తన రాబోయే చిత్రం ‘గౌరవం’. రాధా మోహన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా రిలీజ్ కోసం ఆమె ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది.
‘విక్కీ డోనర్’ సినిమా హిట్ అయినప్పటికీ ఆ హిట్ యామి గౌతంకి సౌత్ లో పెద్ద అవకాశాలు తెచ్చి పెట్టలేదు. ప్రస్తుతం యామి గౌతం తన ఆశలన్నీ ‘గౌరవం’ సినిమా పైనే ఉన్నాయని, ఈ సినిమా హిట్ అయ్యి తెలుగు, తమిళ ఇండస్ట్రీల్లో తనకి మరిన్ని అవకాశాలు తెచ్చి పెడతాయని యామి గౌతం ఆశిస్తోందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమాలో సామాజిక బాధ్యత కలిగిన యామిని అనే లాయర్ పాత్రలో కనిపించనుంది. అలాగే ఈ పాత్ర యామి గౌతంకి నటిగా కూడా మంచి పేరు తెస్తుందని అంటున్నారు.
ఈ సినిమా కాకుండా నితిన్ హీరోగా నటిస్తున్న ‘కొరియర్ బాయ్ కళ్యాణ్’ సినిమాలో యామి గౌతం నటిస్తోంది. ఈ రెండు సినిమాలు తను అనుకున్నట్టు మరిన్ని అవకాశాలు తెచ్చిపెడుతుందా? లేదా అనేదాని కోసం వేచి చూడాలి.